Pages

Sunday, September 12, 2010

స్వామిద్రోహము

స్వామిద్రోహముఁ జేసి యేనొకని గొల్వంబోతినో కాక నే
నీమాట న్విననొల్లకుండితినొ నిన్నే దిక్కుగాఁ జూడనో
యేమీ ఇట్టివృధాపరాధినగు నన్నీ దుఃఖవారాశివీ
చీ మధ్యంబున ముంచి యుంపదగునా శ్రీ కాళహస్తీశ్వరా!

శ్రీ కాళహస్తీశ్వరా, నా ప్రభువగు నిన్ను వదలి నేను మరియొక ప్రభువును సేవింపబోతినా! లేదా నేను నీవు చెప్పిన మాట వినకుంటినా! నీవే నా రక్షకుడవని భావింపక యుంటినా! ఈ విధమైన అపరాధములు నేను చేసియుండలేదే. ఐనను నీవు నన్ను అకారణముగ అపరాధినిగా తలచుచున్నావే! నన్ను మహా దుఃఖసముద్రములో ముంచివేయుచున్నావే! ఇట్లు చేయుట నీకు న్యాయమా!

No comments:

Post a Comment