Pages

Wednesday, September 8, 2010

నీ నా సందొడఁబాటుమాట

నీ నా సందొడఁబాటుమాట వినుమా నీచేత జీతంబు నేఁ
గానిం బట్టక సంతతంబు మది వేడ్కం గొల్తు నంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటీయే చాలుఁ దే
జీనొల్లం గరి నొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా!

శ్రీ కాళహస్తీశ్వరా, నేను నీ సేవకుడనుగాక ముందు మనకొక ఏకాభిప్రాయము కుదురుటకు ఒక మాట చెప్పుచున్నాను వినుము. నేను నిన్ను ఎంతో ఆసక్తితో అన్ని సమయములందు సేవింతును. ప్రతిఫలముగ జీతము కోరను, గుఱ్ఱములు అక్కరలేదు, ఏనుగులు అక్కరలేదు, సంపదలు అక్కరలేదు. ఎందుకనగా వానియందు నాకు ఇఛ్చలేదు. కాని నా చిత్తమందుండి నన్ను భాధించు ఆరుమంది శతృవులకు (కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు) మాత్రం నన్ను అప్పగించవలదు. అంతయే చాలును. ఇంతచేసిన నాకు ఎంతో వేతనమిచ్చినట్లే.

No comments:

Post a Comment