Pages

Wednesday, August 24, 2011

కలధౌతాద్రియు

కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్ బున్కయుం
బులితోలు న్భసితంబుఁ బాఁపతొదవుల్ పోకుండఁ దోఁబుట్లకై
తొలి నేవారలతోడఁ బుట్టక కళాదుల్గల్గె మేలయ్యెనా
సిలువుల్దూరముచేసికొం టెఱింగియే శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నీకు వెండికొండ నివాసము, ఎముకల మాలయే కంఠహారము, తలపుర్రె ఆహారపాత్ర, పులితోలు కట్టుబట్ట, బూడిద నీ మెయిపూత, పాములు శరీరలంకారములు. ఎవరికి లేని ఎవరికి చెందని చంద్రకళ గంగ మొదలైనవి నీకే ఉన్నవి. ఒకవేళ నీకు అన్నలో తమ్ములో ఉన్న, ఈ నీ ధనమును వాహనాదికములు తమకు కావలెనని కాని భాగమిమ్మని కాని అడుగు అవకాశము లేదు. అయినను నీవు నీకు అట్టి చిక్కులు రాకుండవలెనని ముందే ఏ తోబుట్టువులు లేకుండ చేసికొంటివి. ధనము నుండి భాగము కోరువారు లేకపోవుట మేలైనది. ఎవరైన ఉన్నయెడల వారికి భాగమునీయవలసియైన వచ్చును లేదా పంచుటకు శక్యము కాని వానిని అట్లే వారికి ఈయవలసివచ్చును. ఈ గొడవలేలని నీవు తెలిసియే నీకు తమ్ములెవరూ లేకుండ చేసికొంటివ్. 

No comments:

Post a Comment