Pages

Wednesday, August 24, 2011

ఒకయర్ధంబు

ఒకయర్ధంబు నిన్ను నే నడుగఁగా నూహించి నెట్లైనఁ బొ
మ్ము కవిత్వంబులు నాకుఁ జెందనివి యేమో యంటివా నాదుజి
హ్వకు నైసర్గిక కృత్య మింతియ సుమీ ప్రార్ధించుటే కాదు కో
రికల న్నిన్నునుగాన నాకు వశమా శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నీ నుండి ఏ ప్రయోజనమును, ఫలమును అడుగబోవుట లేదు. ఏది ఏట్లు జరుగునో అట్లే జరగనిమ్ము. నీ పై నా స్వభావసిధ్ధముగ కవిత్వమును మాత్రము చెప్పుదును, చెప్పుచునేయుందును. అవి నాకు చెందనివి. నీవు వలదనిను ఆ కవిత్వము నా స్వభావసిద్ధముగ వచ్చుచుండునే యుండును. నీ అనుగ్రహము నీ అంతటే కలుగువలయును గాని నేను కోరితే వచ్చుట సాధ్యమా.
 

No comments:

Post a Comment