తనువే నిత్యముగా నొనర్చు మదిలేదా చచ్చి జన్మింపకుం
డ నుపాయంబు ఘటింపు మాగతుల రెంట న్నేర్పు లేకున్న లే
దని నాకిప్పుడ చెప్పు చేయఁగల కార్యంబున్న సంసేవఁ జే
సి నినుం గాంచెదఁగాక కాలముననో శ్రీ కాళహస్తీశ్వరా!
డ నుపాయంబు ఘటింపు మాగతుల రెంట న్నేర్పు లేకున్న లే
దని నాకిప్పుడ చెప్పు చేయఁగల కార్యంబున్న సంసేవఁ జే
సి నినుం గాంచెదఁగాక కాలముననో శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ శరీరము ఉన్నంతవరకు నిన్ను శాశ్వతముగా సేవించుచుండవలయును. అందుకు అనుకూలముగ నా శరీరము శాశ్వతముగా ఉండునట్లు చేయుము. అది కుదరనిచో నేను చచ్చింతరువాత మరల పుట్టకుండునట్లు నీతో సాయుజ్యము పొందునట్లు అనుగ్రహించుము. ఈ రెండును చేయజాలనిచో ఆ విషయము యిప్పుడే చెప్పుము; నేను ఏమి చేయవలెనో ఆలోచించుకొని నిర్ణయించు కొందను. ఏమియు స్ఫురించనిచో ఇట్లే సేవించి సేవించి నీ యనుగ్రహమును పొంది నిన్ను దర్శించుకొనెదను.
No comments:
Post a Comment