Pages

Wednesday, August 24, 2011

ఆలుం బిడ్డలు

ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధంబు లీనేర్తురే
వేళ న్వారి భజింపఁ జాలిపడ కావిర్భూత మోదంబునం
గాలంబెల్ల సుఖంబు నీకు నిఁక భక్తశ్రేణి రక్షింపకే
శ్రీలెవ్వారికిఁ గూడంబెట్టెదవయా శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నీకుగల అపార ఐశ్వర్యములతో నీవు నీ భార్య, బిడ్డలను, హితులకు వారి వారి ఇష్థసంపదలనిచ్చి వారిని సుఖపెట్టదలుచుచున్నావేమో. కాని వీరు అందరును నీకు ఆవశ్యకమయినప్పుడు ఇష్థప్రయోజనములను కూర్చి నిన్ను సుఖింపజేయుదురా. నీవు ఆనందస్వరూపుడవు. అఖండానందము అఖండసుఖములకు నీకు ఎప్పుడును లోటు రాదు. అవి నీకు యితరులు ఇచ్చుఅవసరము రానేరాదు కదా. కనుక నీ ఐశ్వర్యములతో భక్తుల సమూహమును రక్షింపుము. నీ ఐశ్వర్యములు నీ ఆలుబిడ్డలు కొరకు కూడబెట్టవలసిని పనిలేదు. 

No comments:

Post a Comment