రాజన్నంతనె పోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు వి
ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్రసంరక్షయున్
సౌగన్యంబు కృతంబెఱుంగటయు విశ్వాసంబు గాకున్న దు
ర్బీజశ్రేష్థులు గాఁ గతంబు గలదే శ్రీ కాళహస్తీశ్వరా!
ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్రసంరక్షయున్
సౌగన్యంబు కృతంబెఱుంగటయు విశ్వాసంబు గాకున్న దు
ర్బీజశ్రేష్థులు గాఁ గతంబు గలదే శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! మానవులందు ధర్మముగ ఉండవలసిన గుణములు - దయ, ధర్మము, అభిజాత్యము, విద్య, ఓర్పు, సంస్కారము, సత్యము పలుకుట, విద్వాంసులను మిత్రులను కాపాడుట, సుజనత్వము, కృతజ్ఞత, విశ్వాసము, ఇతరులు తనను నమ్మదగిన వానిగ ఉండుట - రాజులందు కనబడుట లేదు. రాజు కాగానే మానవతాలక్షణములైన్ పై గుణములన్నియు సహజముగానే పోవును కాబోలు. అట్లు కానిచో రాజులు పైన చెప్పిన గుణములు లేని పరమనీచులగుటకు కారణమేదియు కానరాదు.
No comments:
Post a Comment