Pages

Wednesday, August 24, 2011

తను వెందాక

తను వెందాక ధరిత్రి నుండు నను నందాకన్ మహారోగదీ
పనదుఃఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా
వెనుకన్ నీపదపద్మముల్ దలఁచుచున్ విశ్వప్రపంచంబుఁ బా
సిన చిత్తంబున నుండఁజేయంగదవే శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నా శరీరము ఎంతవరకు భూమిపై ఉండునో అంతవరకు ఇది మహారోగముల పాలయి, అవి అధికము కాగా కలుగు దుఃఖములను నేను పొందకుండునట్లు దయాదృష్టితో చూడుము. తదుపరి కోరికయేమనగా నేను నీ పాదపద్మములనే సేవించుచు ధ్యానించుచు నాచిత్తము ఈ సర్వప్రపంచపు వాసనలను వదలగల్గునట్లు అనుగ్రహింపుము. 

No comments:

Post a Comment