Pages

Wednesday, August 24, 2011

రోసిం దేంటిది

రోసిం దేంటిది రోఁత దేంటిది మనొ రోగస్థుండై దేహి తాఁ
బూసిందేంటిది పూఁత లేంటివి మదా(అ)పూతంబు లీ దేహముల్
మూసిందేంటిది మూఁతలేంటివి సదామూఢత్వమే కాని తాఁ
జేసిందేంటిది చేంతలేఁటివి వృధా శ్రీ కాళహస్తీశ్వరా!



శ్రీ కాళహస్తీశ్వరా! వాస్తవమగు తత్వజ్ఞానుభవము కాని చిత్తపవిత్రత కాని పవిత్రవర్తనము కాని లేక శుష్కమగు పాండిత్యము మాత్రము సంపాదించిన కొందరు ’మేము ప్రాపంచిక సుఖములపై రోత చెందితిమి’ అందురు. వాస్తవముగ తమ మనస్సులందు ఏ ఉత్తమ సంస్కారము లేక రోగగ్రస్తమగు మనస్సులు కలవారు. వీరికి ఏమి రోత కలిగినది. రోతనగా వీరికేమి తెలియును. నేను శివభక్తుడను, ఎంత విభూతిని పూసికొంటిని అందురు. వీరు పూసుకొన్నది లేదు వారి దేహములందు ఏపూతయు లేదు. ఎందుకంటె వారి అంతఃకరణములందు పాదుకొనియున్న మదము మొదలైన దుర్దోషములచే వారి దేహములు అపూతములు అపవిత్రములయి ఉన్నవి. నా వాంఛలు మొదలగు వాటిని మాత్రమే కాదు ధ్యానస్థితిలో కన్నులను మూసికొంటిని అందురు. వీరి కన్నులు మూతలు పడియున్నను వీరి మనస్సులు ప్రాపంచిక సుఖాదులు, వానిపై వాంఛలు, వాటిని పొందుటకు దుష్కర్మలును చూచుచునే ఉన్నవి. సదా మూఢత్వమే కాని వీరి అంతఃకరణములందు తత్వజ్ఞానము, యుక్తాయుక్త వివేకము ఉండవు. కనుక శివా నన్ను అట్టివానినిగా కానీయక నిన్ను సదా సేవించువానిగ అనుగ్రహించుము.
 

No comments:

Post a Comment