Pages

Friday, August 26, 2011

జలజశ్రీ గల

జలజశ్రీ గల మంచినీళ్ళు గలవాచత్రాతిలో బాపురే!
వెలివాడ న్మఱి బాఁపనిల్లుగలదావేసాలుగా నక్కటా!
నలి నా రెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ నీ
చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నీవు నా విషయమున "అరరె పద్మములతో శోభిల్లు నీరు సరస్సులయందో నదులయందో ఉండును కాని చట్టురాతిలో ఉండునా, బ్రాహ్మణుల గృహము పవిత్ర మగు బ్రాహ్మణాగ్రహారములో ఉండును కాని చండాలవాటికలలో ఉండునా, అట్లే ఆయా దుష్కృత్యములను చేసి చేసి అపవిత్ర మయిన శరీరమునకు పవిత్రత ఎక్కడిది, పవిత్రమగు ఆలోచనలెట్లు వచ్చును, మలినములగు సంస్కారములతో పాడయిపోయిన నా చిత్తమున నిన్నుపాసించు పవిత్ర ఆలోచనలెక్కడనుంచి వచ్చును" అని నాలో శారీరకముగ మానసికముగ అపవిత్రత భావించి నీలో నాపై రోత కలుగుట తగదు. నాలో ఎన్ని దోషములైన ఉండనిమ్ము. నీలో కల దయాదిగుణములు ఉత్తమములయినవి ఎన్నియో కలవు కదా. వాని విషయమున లోకమునకు నమ్మిక కలుగుట కైన నీవు నన్ను స్వీకరించి నన్ను అనుగ్రహింపుము.
 

1 comment:

  1. Titanium Wedding Band of Honor - The Tatiana Tender
    The Tatiana Tender Group titanium dive watch is titanium shift knob proud titanium bikes to present to you Tribute to Titanium Anniversary! Tribute titanium septum jewelry to Tion's Travina Gourmet Wedding, featuring more than 200 talented titanium trim hair cutter

    ReplyDelete