కలలంచున్ శకునంబులంచు గ్రహయోగం బంచు సాముద్రికం
బు లటంచుం దెవులంచు దిష్ట్మనుచున్ భూతంబులంచు న్విషా
దులటంచు న్నిమిషార్ధ జీవనములంచుం బ్రీతిఁ బుట్టించి యీ
సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా శ్రీ కాళహస్తీశ్వరా!
బు లటంచుం దెవులంచు దిష్ట్మనుచున్ భూతంబులంచు న్విషా
దులటంచు న్నిమిషార్ధ జీవనములంచుం బ్రీతిఁ బుట్టించి యీ
సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! మానవులముగు మాకు మేము మామంచిచెడుగులను మేమే నిర్ణయించు కొనగలమను అజ్ఞానము కలిగించి వెర్రి మొర్రి ప్రాపంచిక విద్యలైన స్వప్నములు - వాటి ఫలితములు, శుభ దుశ్శకునములు, శుభాశుభ గ్రహయోగములు, సాముద్రిక లక్షణములు, అరిష్థములు, దృష్థిదోషములు, భూతములు, విషాదులు మొదలగునవి మామెడకు కట్టితివి. వాని మోహములో వాటిని నమ్ముతు పొరపాటు చేయుచున్నాము. ఇది అంతయు అర్ధనిమేష అల్పకాలజీవనము కొరకే కదా! ఈ లోతును మేము ఆలోచించలేకున్నాము. ఏల ఇట్లు చేసి మమ్ము బధింతువయా ప్రభూ.
No comments:
Post a Comment