Pages

Friday, August 26, 2011

విత్తజ్ఞానము

విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్
మత్తత్వంబు తదంకురం ఐనృతముల్ మాఱాకు లత్యంతదు
ద్వృత్తుల్ పువ్వులుఁ బండ్లు మన్మధముఖా విర్భూతదోషంబులుం
జిత్తాధ్యున్నతనింబభూజమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! మానవుల చిత్తమునందు వ్యధ చాల ఎత్తగు వేపచెట్టు. అది మొలకెత్తుటకు పెరుగుటకు విత్తు ఉండవలెను కదా. అజ్ఞానమే ఆ విత్తు. చిత్తము ఆ విత్తు మొలకెత్తించుటకు చేసిన పాదు. ఆ చిత్తమునందు కలుగు సంసారవిషయక మయిన ఆవేశము ఆ పాదునకు వేసిన గట్టు మరియు ఆ విత్తు మొలకెత్తుటకు కావలసిన నీరు. అహంకారము ఆ విత్తునుండి వచ్చిన మొలక. అసత్యములు ఆ మొలకకు మారాకులు. మానవులాచరించు అత్యంతదుర్వర్తనములు ఆ చెట్టున పూచిన పూవులు, కామము మొదలగు చిత్తదోషములు ఆ చెట్టున పండిన పండ్లు. 

No comments:

Post a Comment