వీడెంబబ్బిన యప్పుడుం దమ నుతుల్ విన్నప్పుడుంబొట్టలోఁ
గూడున్నప్పుడు శ్రీవిలాసములు పైకొన్నప్పుడుం గాయకుల్
పాడంగ వినునప్పుడున్ జెలఁగు దంభప్రాయవిశ్రాణన
క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో ధనవంతులు, రాజులు తమ ఐశ్వర్యములతో వివిధ భోగములు అనుభవించు చుందురు. ఇతరులు తమను పొగుడుచుండగ విని ఆనందించుచుందురు. తమ సంపదలిచ్చు భోగములు అనుభవించుచుందురు. అట్టి ఆనందపారవశ్యములో ములిగిన సమయములో దంభమునకై దానములు చేయుదురు. అవి పవిత్రము కాదు. క్షుద్రమైనవి. నాకు అట్టి సంపదలు వలదు. నీకై ఏ ఐశ్వర్యములు ఒల్లక సకలజీవులకు సకలైశ్వర్యములు, శాశ్వత మోక్షపదము ఇచ్చు నిన్నే ధ్యానింతును, అర్చింతును.

Hi chenna keshava garu
ReplyDeleteDurjati Srikalahasti satakam chala rojula ga chadavalani prayatnistunnanu kani eppudu kudaratledu ippudu me punyama ani ela chadavadam kudirindi chala thanks
Meku na suggestions narasimha satakam chadavandi chala baga untavi padyalu