Pages

Sunday, September 12, 2010

నిప్పై పాతకతూలశైల

నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామమున్ మానవుల్
తప్పన్ దవ్వుల విన్న నంతక భుజాదర్పోద్ధతక్లేశముల్
తప్పుందారును ముక్తు లౌదు రవి శాస్త్రంబుల్మహాపండితుల్
చెప్పంగా దమకింక శంక వలెనా శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా శాస్త్రములు, వాటినెరగిన వారు, అనుభవము కలవారు, పండితులు చెప్పు వచనములు ఏమనగా "శివనామము అగ్ని అని అనదగినిది; దానిని మానవులు తప్పుగానో పొరపాటుగానో తెలిసియో తెలియకయో దూరమునుండి యైన వినినంత మాత్రముచేత కూడ అది కొండలంత పాపములను దూదికుప్పలను అగ్ని కాల్చినట్లు కాల్చును. ఇట్టి నిశ్చితవచనములు ఉండగా మానవులు ’నిన్ను అర్చించుటచే మోక్షము లభించును’ అన్న విషయమున సంశౌయింప పనిలేదు.     

No comments:

Post a Comment