Pages

Friday, August 26, 2011

ఆరావం

ఆరావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ)
కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె
న్నారున్ విశ్వ మనంగఁ దన్మహిమచే నానాదబిందుల్ సుఖ
శ్రీ రంజిల్లఁ గడంగు నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! ఆత్మకు ఆశ్రయస్థానమగు దహరాకాశమునందు ఒక సూక్ష్మతమధ్వని ఉత్పన్నమైనది. అదియే అకార, ఉకార మకార అను మూడు అవయవముల కూడికచేర్మడిన ’ఓం’ కారము. దీనిని ఉపాసనా సంప్రదాయమునందు "తారకము" అని అందురు. మరియొక నామము "నాదము". దీనినుండి దీని మహిమచేతనే విశ్వము ఉత్పన్నమైనది. ఈ విశ్వమునకు "బిందువు" అనియు వ్యవహిరింతురు. నాదము కాని బిందువు కాని చక్కైని శోభతో ప్రకాసించుటకు మూలముగ ఉండు నీవు అదియే సుమా.
ప్రణవమనగ పరమేశ్వరుడు. అతని నుంచి జనించిన విశ్వము సావయవము కాగా అందలి సకలదృశ్యతత్త్వములను చెప్పు సబ్దములకు అన్నిటికిని మూలమగునని అకారాది (౫౦) వర్ణములు. ఇచ్చట ప్రణవము ఏకైకాక్షరము ఈశ్వరుని తెలుపునది. ఈశ్వరుడు వాచ్యము (ప్రణవముచే చెప్పబడువాడు) నిరవయవుడు. అట్లే ఈశ్వరుని నుండి జనించినది సావయవ మగు విశ్వము. దానిని తెలుపు సావయవసబ్దముల మూలతత్త్వము "కలలు" అనబడు వర్ణములు. ప్రణవము ఏకైకాక్షరమైనను దానియందు ఉపాసనకై ఆ తత్త్వమును శివుడు - శక్తి అను అంశములుగ చూడవలయును.
ఏదేని ఒక వస్తువునకును ఆ వస్తువును తెలుపు శబ్దమునకు అభేదము. కనుకనే ప్రణవమునకును దానిచే చెప్పబడు ఈశ్వరునకును అభేదము.
 

No comments:

Post a Comment