Pages

Friday, August 26, 2011

నీభక్తు ల్మదివేల

నీభక్తు ల్మదివేల భంగుల నినున్సేవింబుచున్ వేడఁగా
లోభంబేటికి వారి కోర్కులు కృపళుత్వంబునం దీర్మరా
దా భవ్యంబుఁ దలంచి చూడు పరమార్ధం బిచ్చి పొమ్మన్న నీ
శ్రీ భాండరములోఁ గొఱంతపడునా శ్రీ కాళహస్తీశ్వరా!



శ్రీ కాళహస్తీశ్వరా! నీ భక్తులు నిన్ను బహువిధముల సేవించుచు అనేకపర్యాయములు ’మాకు అది యిమ్ము, ఇది యిమ్ము, ముక్తి ప్రసాదించుము’ అని వేడుచున్నారే. వారి కోరికలు తీర్చక వారికి ఇష్టార్ధములనీయక యున్నావే. నీ వద్ద యున్నవే కదా వారు కోరుచున్నారు. అవి యిచ్చుటలో నీకు లోభము ఏల? దయతో వారి కోరికలను తీర్చరాదా. నీ దగ్గర యున్నదానిలో చాల గొప్పది పరమార్ధ తత్త్వము కదా. అది ఇచ్చిన నీ భాండరములోని ధనము తరిగి పోవునా?
 

No comments:

Post a Comment