Pages

Wednesday, August 24, 2011

మదమాతంగము

మదమాతంగము లందలంబుల హరుల్ మాణిక్యము ల్పల్లకుల్
ముదితల్ చిత్రదుకూలము ల్పరిమళంబు ల్మోక్షమీఁజాలునే?
మదిలో వీని నపేక్షసేసి నృపధామద్వారదేశంబుఁ గా
చి దినంబుల్ వృధపుత్తురజ్ఞులకటా శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! మదపుటేనుగులును, అందలములును, అశ్వములును, మణులును, పల్లకులును, సుందరులగు స్త్రీలును, మేలగు సన్నని వస్త్రములును, సుగంధద్రవ్యములును మోక్షమునీయగలవా! ఇది ఆలోచించని అవివేకులు కొందరు ఇవి కావలయునని, అవి లభించునన్న విశ్వాసముతో రాజభవనద్వారప్రదేశమున కాచి వేచి యుండి దినములను వ్యర్ధముగ గడుపుచుందురు. 

No comments:

Post a Comment