Pages

Wednesday, August 24, 2011

అడుగంమోనిక

అడుగంమోనిక నన్యమార్గరతులంబ్రాణావనోత్సాహినై
యడుగంబోయిన మోదు నీదు పదపద్మారాధకశ్రేణియు
న్నెడకు న్నిన్ను భజింపంగాఁగనియు నాకేలా పరాపేక్ష కో
రెడి దింకేమి భవత్ప్రసాదమె తగున్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నాకు నీ సేవ లభించినందున, ఇక నా కొఱకై నిన్ను సేవించుటయందాసక్తి లేని వారినెవ్వరిని ఏమియు కోరను. ఒక వేళ ఆవశ్యకత కలిగిన, నీ పాద పద్మములనారాధించు వారి దగ్గరికి మాత్రమే పోయెదను. వారినే యాచింతును. నీ సేవ లభించిన తరువాత కూడ నేను ఇతర దేవతలను కాని నీ భక్తులు కానివారిని కాని ఏల యాచింతును? నీ అనుగ్రహమొక్కటియే నాకు చాలును. 

No comments:

Post a Comment