Pages

Wednesday, August 24, 2011

జ్ఞాతుల్ ద్రోహంబు

జ్ఞాతుల్ ద్రోహంబు వాండ్రు సేయుకపటేర్యాది క్రియాదోషముల్
మాతండ్రాన సహింపరాదు ప్రతికర్మంబించుకే జేయగాఁ
బోతే దోసము గాన మాని యతినై పోఁగోరినన్ సర్వదా
చేతఃక్రోధము మాన దెట్లు నడుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నా జ్ఞాతులు నాకు ద్రోహము చేయువారే కాని హితము చేయువారు కారు. నా విషయమున చూపు కపటము అసూయ మొదలగు దుర్భావనలను ఆ భావములతో వారు చేయు పనులను సహించుట శక్యము కాదు. నా తండ్రిపై ఆన. వారు నా విషయమున చేయు చెడుగులకు ప్రత్యపకారము చేయను. ఎందుకనగా దాని వలన నాకు దోషము కల్గును. వారి విషయము ఆలోచించక వారికి దూరముగ తొలగిపోదుమన్న మనస్సునందు ఆ జ్ఞాతులపై క్రోధము తగ్గవలయును. కాని అది తగ్గుట లేదు. ఏమి చేయుదును? నా అంతఃకరణవృత్తులందలి సకలదోషములను మానిపి నీ పాదపద్మముల యంద్ నిశ్చల నిర్మల భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము.
 

1 comment:

  1. చెన్న కేశవ కుమార్ గారూ... "ద్రోహంబు వాండ్రు" సరిచేయవలసి యున్నది

    ReplyDelete