నీ కారుణ్యముఁ గల్గినట్టి నరుఁ డేనీచాలయంబుల జొరం
డేకార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్
గైకోడే మతముల్ భజింపఁ డిలనేకష్టప్రకారంబులన్
జీకాకై చెడిపోఁదు జీవనదశన్ శ్రీ కాళహస్తీశ్వరా!
డేకార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్
గైకోడే మతముల్ భజింపఁ డిలనేకష్టప్రకారంబులన్
జీకాకై చెడిపోఁదు జీవనదశన్ శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! ఎవనిపై నీ కరుణ కలుగునో వాడు తన జీవన నిర్వహణమునకై ఏ నీచప్రభువులను, ధనికులను సేవలకై వారి భవనములలో ప్రవేశించవలసిన పనిలేదు. కృపణత్వమును (దైన్యము) ప్రకటించవలసిన పనిలేదు. ఏ కపట వేషము వేయలసిన పనిలేదు. శివ భక్తినే కాని ఇతరమతములను ఆదరించడు, స్వీకరించడు, ఏ కష్టమగు రీతులతో తన చిత్తము చీకాకు చెంది చెడిపోడు. తన జీవన దశలో స్థిరచిత్తుడై వర్తించును. తద్వారా ఉత్తమగతిని పొందును.
No comments:
Post a Comment