మొదలం జేసినవారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు
ర్మదులై యిప్పుడు వారె ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న
వ్వడె రానున్న దురాత్ములెల్ల దమత్రోవం బోవరే ఏల చే
సెదరో మీఁదు దలంచిచూడ కధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!
ర్మదులై యిప్పుడు వారె ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న
వ్వడె రానున్న దురాత్ములెల్ల దమత్రోవం బోవరే ఏల చే
సెదరో మీఁదు దలంచిచూడ కధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు దురాత్ములు సన్మార్గులవలె నటించుచు గతంలో కొందరు ధర్మకర్తలు నిర్మించిన దేవాలయములను నిర్మూలించి తాము మరియొక ధర్మకార్యమును ఆచరింతురు. వీరిని వీరిదోషములతో కూడిన ధర్మకార్యములను చూసి, దేవుడు తప్పక నవ్వుకొనును. ఇటువంటివారి వలన లోకమున వాస్తవమగు ధర్మము భ్రష్థమగుచున్నది. ఈ చెడుపనుల వలన తమకు పుణ్యము లభించునా లేదా అని కాని తమవలన లోకమునకు హాని కలుగునని కాని తమకు పరమున నరకాది లోకములు ప్రాప్రించునని కాని భయపడకున్నారు.
No comments:
Post a Comment