Pages

Friday, August 26, 2011

పరిశీలించితి

పరిశీలించితి మంత్రతంత్రములు చెప్ప న్వింటి సాంఖ్యాదియో
గ రహస్యంబులు వేద శాస్త్రములు వక్కాణించితిన్ శంకవో
దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన నమ్మిచ్ంచి సు
స్థిరవిజ్ఞానము త్రోవఁ జెప్పఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నేను ఎన్నియో మంత్ర తంత్రములను పరిశీలించితిని. వానిననుష్థించి వానివలన కలుగు ఫలమేమియో ఎంతయో అనుభవమున కూడ ఎరిగితిని. సాంఖ్యయోగము మొదలగు శాస్త్రములను పండితులు ప్రవచించగా వింటిని. శాస్త్రార్ధములనె ఎరిగియుంటిని. ఎన్ని చేసినను, అవి గుమ్మడికాయంతనుండి ఆవగింజంత కూడ నా సందేహములు తీరలేదు. కనుక అన్య శరణములేని వాడనై నిన్ను ఆశ్రయించి వేడుచున్నాను. నీవు నాకు తత్త్వవిషయమై విశ్వాసము కలిగించి స్థిరమైన సత్యము విజ్ఞానము కలుగునట్లు చేసి అనుగ్రహించుము.
 

No comments:

Post a Comment