తరఁగల్ పిప్పలపత్రముల్ మెఱఁగు టద్దంబుల్ మరుద్దీపముల్
కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత్కీటప్రభల్
సురవీధీలిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నాపఃపిండముల్
సిరులందేల మదాంధులౌదురు జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత్కీటప్రభల్
సురవీధీలిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నాపఃపిండముల్
సిరులందేల మదాంధులౌదురు జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! ప్రాణములు, నీటి అలలవలె, రావిఆకులవలె, మెఱపులతో చెయబడిన అద్దములవలె, గాలిలో పెట్టిన దీపమువలె, ఏనుగు చెవుల కొనలవలె, ఎండమావులవలె, మిణుగురు పురుగుల కాంతులవలె, ఆకాశమందు వ్రాయబడిన అక్షరములవలె భ్రాంతిచే కల్పింపబడిన అవాస్తవములు , క్షణికములు అయియున్నవి. సంపదలు మంచునీటి బొట్టులవలె ఎప్పుడు కరిగిపోవునో తరిగిపోవునో తెలియదు. జనులు వానియందు మునిగి, మదముచే కన్నును మిన్నును కానని గ్రుడ్డివారుగా అజ్ఞానులుగా ఏల అవుదురో చెప్పజాలకున్నాను.
No comments:
Post a Comment