నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ నీకన్న నాకెన్నలే
రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుందాపత్సహాయుందు నా
యన్నా! యెన్నడు నన్ను సంస్కృతివిషాదాంభోధి దాటించి య
ఛ్చిన్నానందసుఖాబ్ధిఁ దేల్చెదొ కదే శ్రీ కాళహస్తీశ్వరా!
రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుందాపత్సహాయుందు నా
యన్నా! యెన్నడు నన్ను సంస్కృతివిషాదాంభోధి దాటించి య
ఛ్చిన్నానందసుఖాబ్ధిఁ దేల్చెదొ కదే శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! నేను నిన్ను నమ్మినట్లు మరి ఎవ్వరిని విశ్వసించను. అన్నలు, తమ్ములు తల్లియు తండ్రియు, గురుడు ఇతరులెవ్వరును ఆపదలందు నాకు సాయపడువారు లేరు. నా తండ్రీ నిన్నే విశ్వసించి ఆశ్రయించిన నన్ను ఈ సంసారదుఃఖసాగరమునుండి దాటించి యెప్పుడు అఖండానందామృతసముద్రమున తేలియాడునట్లు చేయుదువో కదా!
No comments:
Post a Comment