Pages

Wednesday, August 24, 2011

రతిరా జుద్ధతి

రతిరా జుద్ధతి మీఱ నొక్కపరి గోరాజాశ్వుని న్నొత్తఁ బో
నతఁ డాదర్పకు వేగ నొత్త గవయం బాంబోతునుం దాఁకి యు
గ్రతఁ బోరాడంగనున్న యున్నడిమి లేఁగల్వోలె శోకానల
స్థితిపాలై మొఱపెట్టునన్ మనుపవే శ్రీ కాళహస్తీశ్వరా!



శ్రీ కాళహస్తీశ్వరా! శివభక్తుల మనస్సులందు ఒకప్పుడు స్వాభావికమగు కామభావము తన శక్తిని అధికముగ చూపును. అట్లు మన్మధుడు శివుని అణచివేయుచుండును. మరియొక సమయమున శివుడే తన శక్తి పైచేయి కాగా భక్తుల మనస్సులయందలి మన్మధుని నొక్కివేయుచుండున్. ఇట్లు శివ మన్మధులు తమ బలములను చూపుచూ బాగుగా పోరాడుచుండుట గవయ మృగము ఆబోతు పోరాడుచున్నట్లున్నది. అట్టి పోరాటములో లేగ నలిగిపోవునట్లు, నీ భక్తులు ఈ రెండు భావముల మధ్య నలిగిపోవుచున్నారు. కనుక ప్రభూ వీరి ఇట్టి కష్టమును తెలిసికొని వీరలపై దయవహించి రక్షించుమా. 

No comments:

Post a Comment