గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం
తతముం గూటికినై చరింప వినలేదా ’యాయు రన్నం ప్రయ
చ్ఛతి’ యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ
షితదుర్మార్గుల్ గానఁ గానంబడవో శ్రీ కాళహస్తీశ్వరా!
తతముం గూటికినై చరింప వినలేదా ’యాయు రన్నం ప్రయ
చ్ఛతి’ యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ
షితదుర్మార్గుల్ గానఁ గానంబడవో శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! లోకమున కొందరకు నిన్ను సేవించవలయునని, ధ్యానించవలెనని, తత్వమునెరుగవలెనని ఆలోచన వచ్చుటలేదు. నీవే గతియని నమ్మినవారు మోక్షము నొందుట చూసి కూడ నిన్నెరుగక, ధ్యానించక, సేవించక నిరంతర ధన సంపాదనకు, ఉదరపోషణకు యత్నములు చేయుచు కాలయాపన చేయుచున్నారు. వారు ’ఆయు రన్నం ప్రయచ్ఛతి’ - పూర్వజన్మకర్మఫలమగు ప్రారబ్ధముచే ఈ జన్మమునకు నిర్ణయించబడిన ఆయువే వీరి జీవితకాలము. ఆ ఆయువున్నంతవరకు బ్రదుకుటకు ఆవశ్యకమగునంత ఆహారము కూడ ఇచ్చును - అను శ్రుతుల మాటలు కూడ చెవినబెట్టకున్నారు. వీరిని సంసారాంధకారము క్రమ్మి వీరి అంతఃకరణమును మూసివేసినది.
No comments:
Post a Comment