Pages

Wednesday, August 24, 2011

స్తోత్రం బన్యులఁ

స్తోత్రం బన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతోఁ
బుత్రీ పుత్ర కలత్ర రక్షణ కళాబుధ్ధిన్ నృపాలా(అ)ధమన్
బాత్రం బంచు భజింపఁబోదు రితియున్ భాష్యంబె యివ్వారిచా
రిత్రం బెన్నఁడు మెచ్చ నెంచ మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! లోకమందు ఇతరులను స్తుతి చేయుటకు ఇష్థపదనివారుగాని, ఇతరులను స్తుతించనన్న వ్రతము పూనినవారుగాని వేసము మాత్రమే వేసి, పైకి అట్లు చెప్పుచు నటించుచుందురు. కాని తమవారిని రక్షించుటకు కాని పోషించుటకు కాని రాజాధములను ఆశ్రయించి తమ స్తోత్రములతొ సేవించబోదురు. ఇది తగిన పనియా. నేను మాత్రము అట్టి పని ఎన్నడు చేయను.
 

No comments:

Post a Comment