Pages

Wednesday, August 24, 2011

సంతోషించితినిఁ

సంతోషించితినిఁ జాలుంజాలు రతిరాజద్వారసౌఖ్యంబులన్
శాంతిన్ బొందితిఁ జాలుఁజాలు బహురాజద్వారసౌఖ్యంబులన్
శాంతిం బొందెదఁ జూపు బ్రహ్మపదరాజద్వారసౌఖ్యంబు ని
శ్చింతన్ శాంతుఁడ నౌదు నీ కరుణచే శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నేనింతవరకు రతిరాజగు మన్మధ రాజ ద్వారమువద్ద కామసుఖములకై యత్నములు చేసి ఎంతోకొంత సుఖించితిని. ఇక అవి చాలు చాలును. అనేక రాగుల ద్వారములవద్ద ఆశ్రయము లభించుటచే సౌకర్యములద్వారా ఎంతోకొంత శాంతి కలిగినది. ఆ సౌఖ్యములు చాలును. ఇకమీదట పరబ్రహ్మపదమను రాజుగారి ద్వారమున కలుగు సౌఖ్యము (మోక్షము) కోరుచున్నాను. నాకు ఆ అనుభవము చూపుము. దానిని అనుభవించి శాశ్వతమగు శాంతిని పొందెదను. 

No comments:

Post a Comment