నీ పేరున్ భవదంఘ్రితీర్ధము భవన్నిష్ఠ్యూత తాంబూలమున్
నీ పళ్లెంబు ప్రసాదముం గొనికదా నే బిడ్డనైనాఁడ న
న్నీపాటిం గరుణింపు మోఁప నిఁక నీనెవ్వారికిం బిడ్డగాఁ
జేపట్టం దగుఁ బట్టి మానఁ దగదో శ్రీ కాళహస్తీశ్వరా!
నీ పళ్లెంబు ప్రసాదముం గొనికదా నే బిడ్డనైనాఁడ న
న్నీపాటిం గరుణింపు మోఁప నిఁక నీనెవ్వారికిం బిడ్డగాఁ
జేపట్టం దగుఁ బట్టి మానఁ దగదో శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! నేను నీ నామమును నా నామముగా ధరించియున్నాను. నీ నామమే నా ధ్యేయముగా గ్రహించుచున్నాను. నీ పాదతీర్ధమును త్రావుచుందును. నీవు నమిలి ఉమిసిన తాంబూలము భక్తితో గ్రహించుచుందును. నీకు నివేదించిన ఆహారపు పళ్లెరములో లభించిన ప్రసాదమును తినుచుందును. ఇట్లు అనేక విధములుగ పుత్రుడనైన నన్ను నీ బిడ్డగనే ఉండనిమ్ము. మరియొకరెవరికి పుత్రుడనవను. తండ్రి తన పుత్రుని విడువదగదు కదా!
No comments:
Post a Comment