Pages

Wednesday, August 24, 2011

అమ్మా యయ్య

అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నేనన్నన్శివా! నిన్నునే
సుమ్మీ! నీ మదిఁ దల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా
కిమ్మైఁ దల్లియుఁ దండ్రియున్ గురుఁడు నీవే కాక సంసారపుం
జిమ్మంజీకంటి గప్పిన న్గడవు నన్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నేనెప్పుడైన బాధలలో ’అమ్మా! అయ్యా!’ అనిన అది నిన్నుద్దేశించియే సుమా! ఆ మాటలు నన్ను కన్నవారినుద్దేశించి అనుచున్నట్లు తలచి నన్ను నీవు వదలవద్దు. అట్టి నా ఆపదలు తొలగించి నన్ను రక్షించుచు నాకు ఆనందము కలిగించు తల్లియు తండ్రియు గురుడువు నీవు మాత్రమే. కనుక నన్ను సంసారపు చిమ్మచీకటులు చుట్టుముట్టిన సమయమున నీవు నన్ను వానినుండి ఆవలకు పోగలుగునట్లు చేయుమని వేడుచున్నాను. 

No comments:

Post a Comment