Pages

Wednesday, August 24, 2011

ఒకరిం జంపి

ఒకరిం జంపి పదస్థులై బ్రతుకఁ దామొక్కొక్క రూహింతురే
లొకొ తామెన్నఁడుఁ జావరో తమకుఁ బోవో సంపదల్ పుత్రమి
త్రకళత్రాదులతోడ నిత్య సుఖమందం గందురో యున్నవా
రికి లేదో మృతి యెన్నఁడుం గటకట శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు ఇతరులని చంపి తాము ఉన్నత పదములను పొంది సుఖించవలెనని తలచుచుందురు. ఆలోచించి చూడగ తామెన్నడును చావరా? తమ సంపదలు ఎన్నటికి పోక అట్లే ఉండునా? తాము హింసతో, క్రౌర్యముతో సంపాదించిన ఉన్నత పదములతో తాము తమ పుత్ర, మిత్ర, కళత్రములతో కూడి శాశ్వరముగా సుఖించగలరా? అట్లుండదని వారికి తెలియదా. 

No comments:

Post a Comment