Pages

Monday, August 22, 2011

నీకు న్మాంసము

నీకు న్మాంసము వాంఛయేని కఱవా నీచేత లేడుండఁగాఁ
జోకైనట్టి కుఠారముండ ననల జ్యోతుండ నీరుండఁగా
బాకం బొప్ప ఘటించి చేతిపునుకన్ భక్షింపకాబోయచేఁ
జేకొం టెంగిలిమాంసమిట్లు దగునా శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నీకు మాంసము తినుటయందిష్టమున్న నీచేత నున్న లేడిని ఇంకొక చేతనున్న గండ్రగొడ్డలితో కోసి ఆ మాంసమును తలనున్న గంగాజలముతో నుదుటనున్న నేత్రాగ్నియందు పాకముచేసి ఇంకొక బ్రహ్మకపాలములో భుజించు అవకాశము ఉండగా ఆ బోయవాని చేతి ఎంగిలిమాసమును తినుట నీకు తగునా!

No comments:

Post a Comment