Pages

Friday, August 26, 2011

నన్నే యెనుఁగుతోలుదుప్పటము

నన్నే యెనుఁగుతోలుదుప్పటము బువ్వాకాలకూతంబు చే
గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మేల్
నిన్నీలాగున నుంటయుం దెలిసియున్ నీపాదపద్మంబు చే
ర్చెన్ నారయణుఁ డెట్లు మానసముఁ దా శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నీకందము కలిగించు వస్త్రము ఏనుగుతోలుదుప్పటము కదా! కాలకూట మహావిషము నీ ఆహారము కదా! బ్రహ్మదేవుని తలపుర్రె నీవు అన్నము తినుటకుపయోగించు గిన్నె కదా! నీ కంఠహారము భయంకరమగు సర్పము కదా! మంచిది. ఇటువంటి లక్షణములు కలవని తెలిసీ పురుషోత్తముడగు విష్ణువు తన మానసమును నీ పాదపద్మములందు నిలిపెను కదా!
అనగా సర్వదేవోత్తముడవగు మహాదేవుడవయిన నీ పరికరములేమి అయిన ఏమి? అందులకే విష్ణువే నిన్ను ఆరాధించుచుండగా నేను కూడ నిన్నే ఆశ్రయించి సేవింతును.
 

No comments:

Post a Comment