Pages

Friday, August 26, 2011

ద్వారద్వారములందుఁ

ద్వారద్వారములందుఁ జంచుకిజనవ్రాతంబు దండంములన్
దోరంత్స్థలి బగ్గనం బొడుచుచున్ దుర్భాషలాడ న్మఱిన్
వారిం బ్రార్ధనచేసి రాజులకు సేవల్సేయఁగాఁబోరుల
క్ష్మీరాజ్యంబును గోరి నీమరిజనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! మోక్షలక్ష్మీరాజ్యము గోరు నీ భక్తులు, రాగులిచ్చు తుచ్చములగు లక్ష్మిని కోరి రాజసేవ చేయుటకిష్ఠపడరు. రాజాశ్రయము కోరి వారి దర్శనము కోరిన వారి పాట్లు చూసేవ వారు రాజుల సేవ చేయరు. ఆ పాట్లెట్లుండుననగా, రాజ దర్శనమునకు పోవు వారు త్రోవలో దుర్గములు, ప్రాకారములు ద్వారా పోవలయును. అట్టి ప్రదేశములలో కంచుకులను రక్షకులుందురు. వారు వీరి యోగ్యత గణించక, కంచుకములతో త్రోయుచు శరీరభాగములంచు గాయములు చేయుదురు. దుర్భాషలు కూడ పలుకుదురు. వీరు ఆ కంచుకులను బ్రతిమాలి బామాలి రాజ దర్శనము చేయవలెను. దేవా నీ దర్శమునకై ఇన్ని పాట్లు పడవలసిన పనిలేదు. నిర్మలమగు భక్తితో సేవించినవారిని వారు భక్తితో సమర్పించిన మారేడుదళముతో సంతృప్తినొంది అనుగ్రహింతువు. ఇహమున సుఖములిచ్చుటయే కాక పరమున మోక్షసామ్రాజ్యము ప్రసాదింతువు. 

No comments:

Post a Comment