Pages

Friday, August 26, 2011

ఒకపూఁటించుక

ఒకపూఁటించుక కూడ తక్కువగునే నోర్వంగలేఁ డెండకో
పక నీడన్వెదకుం జలిం జడిచి కుంపట్లెత్తుకోఁజూచు వా
నకు నిండిండ్లును దూఱు నీతనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో
సి కడాసింపరుగాక మర్త్వులకట శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! మనుషులు తమకు ఒకపూట కొంచెము కూడు తక్కువయినచో ఓర్చుకొనడు. ఎండ తగులుచున్నచో ఒర్చుకొనజాలక నీడకై వెదకుచు పోవును. చలి వేసినచో వెచ్చదనమునకు కుంపటి ఎత్తుకొన యత్నించును. ఎక్కడికైన పోవునప్పుడు వాన వచ్చినచో ఇల్లుల్లు దూరి వాననుండి రక్షించుకొన యత్నించును. శరీరమును సుఖపెట్టుటకు ఈ ప్రయత్నములన్ని చేయుచున్నాడు. ఈ శరీరము వలన కలుగు సుఖములు అశాశ్వతము, కృత్రిమము. ఇది ఎరుగక పరమార్ధమునకై ప్రయత్నించుటయు లేదు. ఎంత శోచనీయము. 

No comments:

Post a Comment