Pages

Friday, August 26, 2011

ఊరూరం

ఊరూరం జనులెల్ల బిక్ష మిదరోయుందం గుహల్గల్గవో
చీరానీకము వీధులం దొరుకరో శీతామృతస్వచ్ఛవాః
పూరం బేరులఁ బాఱదో తపసులంబ్రోవంగ నీవోపవో
చేరం బోవుదురేల రాగుల జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించినచో పండితులు కవులు రాగులను ఆశ్రయించవలసిన ఆవశ్యకత ఏమున్నది? బిచ్చమెత్తుటకు పోయినచో జనులు బిచ్చము పెట్టరా. ఎండనుండి వాననుండి కాపాడుకొనుటకు కొండ గుహలు లేవా. మానసంరక్షణకు చింకిపాతలు దొరకవా. జలప్రవాహములందు చల్లని తీయని నీరు దొరకదా. అట్టి జీవనము గడుపుతూ నిన్ను సేవించువారిని నీవు దయతో అనుగ్రహించనున్నావు కదా. మరి రాజుల నాశ్రయించుట ఎందుకు?
 

No comments:

Post a Comment