Pages

Friday, August 26, 2011

చవిగాఁ జూడ

చవిగాఁ జూడ వినంగ మూర్కొనఁ దనూసంఘర్షణాస్వాదమొం
ద వినిర్మించెద వేల జంతువుల నేతత్క్రీడలే పాతక
వ్యవహారంబలు సేయునేమిటికి మాయావిద్యచే బ్రొద్దుపు
చ్చి వినోదింపఁగ దీన నేమి ఫలమో శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! ఇంద్రజాలికుడు చిత్రవిచిత్రములను కనబర్చునట్లుగా నీవు జంతువులయందు చూచుటకు నేత్రములు, వినుటకు చెవులు, వాసన చూచుటకు ముక్కు, రుచులను తెలిసికొనుటకు నాలుక, శీతోష్ణ స్పర్సలు తెలిసికొనుటకు చర్మము సృజించితివి. అవివేకులు వాటిని సద్వృత్తులయందు ప్రవర్తింపజేయలేక దుర్వృత్తులందు ప్రవర్తింపజేసి పాపములు చేయుచున్నారు. ఇట్లు చేయుటవలన నీకేమి లాభమో తెలియదు. 

No comments:

Post a Comment