Pages

Friday, August 26, 2011

వెనుక్ం

వెనుక్ం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్
వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్
నను నేఁజూడగ నావిధుల్దలంచియున్ నాకే భయం బయ్యెడుం
జెనకుంజీఁకటియాయెఁ గాలమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ జన్మముననే మునుపు ఆయా యౌవనాది దశలయందు చేసిన దుష్కర్మముల నాలోచించిన కొలది రోత కల్గుచున్నది. త్వరలోనో కొంతకాలమునకో రానున్న దుర్మరణము తలుచుకొనగా ఈ ఉన్న కాలమైన సదుపయోగము చేసికొని నిన్ను ఆరాధింపనిచో జీవితమునందు ఏమి మేలు సాధించనివాదనగుదునే. నేను చేసిన పనులను తల్చుకొనిన నన్ను చూడగా నాకే భయము కల్గుచున్నది. ఏది ఏమైనను కాలమునకు (నా ఆయువునకు) అత్యంత బాధాకరమగు చీకటి క్రమ్ముకొనివచ్చుచున్నట్లగుచున్నది. మిగిలిన ఈ కొంతకాలమైన నిన్ను ఏకాంతముగ ఆరాధించి నీ అనుగ్రహము పొందుటకు యత్నము చేయుదును.
 

No comments:

Post a Comment