Pages

Sunday, September 12, 2010

ఏ వేదంబు

ఏ వేదంబు బఠించె లూత భుజంగం బేశాస్త్రముల్సూచె దా
నే విద్యాభ్యసనంబొనర్చెఁ గరి చెంచేమంత్ర మూహించె బో
ధావిర్భావనిదానముల్ చదువులయ్యా! కావు! మీపాదసం
సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నీనామములోనే ఇమిడియున్న పదములకు అర్ధముగ ఉన్న ప్రాణులగు వానిలో సాలెపురుగు ఏ వేదమును అధ్యయము చేయలేదు; సర్పము ఏ శాస్త్రములు చదువలేదు; ఏనుగు ఏ విద్యలు అభ్యసించలేదు; చెంచువాడగు తిన్నడు ఏ మంత్రము ఉపాసించలేదు. ఐనను గాఢాసక్తితో నిన్ను సేవించి ముక్తి మోక్షము పొందెను. అందువలన ఏ ప్రాణి ఐనను ఆసక్తితో చేయు నీ సేవయే మోక్షప్రదమగును అని తెలియుచున్నది.

No comments:

Post a Comment