Pages

Sunday, September 12, 2010

నిను సేవింపగ

నిను సేవింపగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ
జనమాత్రుండననీ మహాత్ము డననీ సంసారమోహంబు పై
కొననీ జ్ఞానము గల్గనీ గ్రహగనుల్ గుందింపనీ మేలువ
చ్చిన రానీ యవి నాకు భూషణములో శ్రీ కాళహస్తీశ్వరా!

శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను సేవించుటచేత నాకు ఆపదలు కలుగనీ, నిత్యము ఉత్సవములే సిధ్ధించనీ, ఇతరులు నన్ను సాధారణ మానవునిగ అననీ, మహాత్ముడని మెచ్చుకొననీ, సంసారబంధవిషయమున సుఖభ్రాంతిచే, మోహమే కలుగనీ, వివేకముచే శివతత్వ జ్ఞానమే కలుగనీ, గ్రహచారవశమున బాధలే రానిమ్ము, మేలే కలుగనీ. అవి అన్నియు నాకు అలంకారములే అని భావించుచు వదలక నిన్ను సేవింతును.

No comments:

Post a Comment