భవకేలీమదిరామదంబున మహా పాపాత్ముఁడై వీడు న
న్ను వివేకింపఁ డటంచు నేను నరకార్ణోరాశిపాలైనఁ బ
ట్టవు; బాలుండొకచోట నాటతమితోడ న్నూతఁ గూలంగఁ దం
డ్రి విచారింపక యుండునా కటకటా శ్రీ కాళహస్తీశ్వరా!
న్ను వివేకింపఁ డటంచు నేను నరకార్ణోరాశిపాలైనఁ బ
ట్టవు; బాలుండొకచోట నాటతమితోడ న్నూతఁ గూలంగఁ దం
డ్రి విచారింపక యుండునా కటకటా శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా, నీవు నా విషయమై "వీడు సంసార సుఖములయందాసక్తుడై అందు క్రీడించుచు మహాపాపము చేసినాడు, నన్ను యెరగకున్నాడు, మహాపాపాత్ముడై యున్నాడు, వీనితో నాకేమి?" అని తలచుచున్నావు. నేను నరకసముద్రములో పడియున్నను పట్టించుకొనకున్నావు. ఇది నీకు తగునా! తన పిల్లవాడు ఆడుకొనుచు ఆటలోని పారవశ్యములో, యెరుగక నూతిలో పడినచో వాని తండ్రి తన పిల్లవాడు ఏమయ్యెనో విచారింపక, వానిని నూతినుండి బయటకు తీయకుండ ఊరకుండునా!
No comments:
Post a Comment