Pages

Wednesday, August 24, 2011

భవదుఃఖంబులు

భవదుఃఖంబులు రాజకీటముల నేబ్రార్ధించినం బాయునే
భవదంఘ్రిస్తుతిచేతఁగాక విలసద్బాలక్షుధాక్లేశదు
ష్టవిధుల్మానునె చూడ మేఁకమెడచంటందల్లి కారుణ్యద్బ
ష్థివిశేషంబున నిచ్చి చంటఁబలె నో శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! సంసారదుఃఖములు తొలగుట నీ పాదపద్మస్తుతిచేతనే అగును కాని నీ ముందు కీటకములవంటి వారగు రాజులను స్తుతించుటచే కాదు. ఎట్లన పసివారికి తమ తల్లులు వాత్సల్యముతో దయాభావముతో ఇచ్చు స్తన్యమును త్రాగుటచే వారి ఆకలిదప్పులు తీరునే కాని మేకల మెడలనుండి వ్రేలాడు చంటినుండి తీరవు కదా! 

No comments:

Post a Comment