Pages

Wednesday, August 24, 2011

శుకముల్

శుకముల్ కింశుకపుష్పముల్ గని ఫలస్తోమం బటంచున్సము
త్సుకతం దేరఁగఁ బోవు నచ్చట మహా దుఃఖంబు సిద్ధించుఁ; గ
ర్మకళాభాషలకెల్లఁ బ్రాపులగు శాస్త్రంబు ల్విలోకించువా
రికి నిత్యత్వమనీష దూరమగుఁజూ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! చిలుకలు ఎర్రని మోదుగుపూవులను పండ్ల గుత్తులనుకొని మిగుల ఆసక్తితో ఎప్పుడెప్పుడవి తిందుమా అను తహతహతో పాటుతో వానిని తెచ్చుకొనపోవును. కాని పండ్లు లభించక పోగా మరియొక కష్థము సిద్ధించును. అట్లే కర్మానుష్థానము బోధించు వేదాది విద్యలను వానికి తోడుగ శాస్త్రములను అధ్యయనము చేయువారికి నీ అనుగ్రహము కలుగదు. కర్మల ననుష్ఠించుటకు ఫలముగ వీరికి అశాశ్వతమగు స్వర్గాది లోకసుఖములు పునః పునర్జన్మలొందుచున్నారే కాని నిన్ను నిత్యమని తెలిసికొనక నీకయి సాధనము చేయుట దానిని సాధించుటయు జరుగదుకదా. 

No comments:

Post a Comment