Pages

Wednesday, August 24, 2011

చదువుల్

చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్
వదరన్ సంశయభీకరాటవులం ద్రోవల్దప్పి వర్తింపఁగా
మదనక్రోధకిరాతులందుఁ గని భీమప్రౌఢిచేఁ దాఁకినం
జెదరుం జిత్తము చిత్తగింపఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! శాస్త్రములను బాగుగా చదివిన పండితులు వాస్తవమున పండితులనదగిన వారు కాదు. పండితులలో అధములు లేదా పండితులుగ కాన్పడు అధములు. వారు తాము నేర్చిన పాండిత్యములో తమకు తోచినదానినే ఉచితమనుచు తమ ఇచ్చవచ్చినట్లు స్వేచ్ఛాభాషణములను చేయుచు వదరుచుందురు. కాని వాస్తవమున వారికి ఏ విషయమునను నిశ్చయ జ్ఞానము ఉండదు. సంశయములు తీరియుండవు. అందుచే వారు సంశయములను భయంకరారణ్యములో సరియగు త్రోవనెరుగక దారి తప్పి తిరుగుచుందురు. అట్టి స్థితిలో నున్న వారి చిత్తము ఏమియు తోచనిదై చెదరిపోవును. ఆ స్థితిని నీవు చిత్తగించవలయునని వేడుచున్నాను. 

No comments:

Post a Comment