Pages

Friday, August 26, 2011

గడియల్ రెంటికొ

గడియల్ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁడెల్లియో
కడ నేఁడాదికొ యెన్నఁడో యెఱుఁ గ మీకాయంబు లీభూమిపైఁ
బడగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటింప రీ మానవుల్
చెడుగుల్ నీపదభక్తియుం దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! ఇప్పటినుండి రెండు లేదా మూడు లేదా ఒక గడియ తరువాతనే కాని మరికొంత తడవుగ ఈనాడో మరునాడో కాకున్నను సంవత్సరమునకో మరి ఎన్నడో తెలియదు కాని మొత్తము మీద ఈ శరీరములు జీవరహితము లగుచు భూమిమీద పడక తప్పదు. దేహములు నశించక ఉండిపోవు. కాని యిది ఎరుగియు మానవులు ధర్మమార్గమును ఒక్కదానినైన ఆచరించక ఉన్నారు. అధమము నీ పదములయందు భక్తిని పూనలేక యున్నారు కదా. 

No comments:

Post a Comment