Pages

Friday, August 26, 2011

చెడుగుల్

చెడుగుల్ కొందఱు కూడి చేయంగంబనుల్ చీకట్లు దూఱంగఁ మా
ల్పడితిం గాన గ్రహింపరాని నిను నొల్లంజాలఁ బొమ్మంచు నిల్
వెలంద్రోచినఁ జూరుపట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కిఁ గో
రెడి యర్ధంబులు నాకు నేల యిడవో శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు దుష్టులు నాము ఒకటిగా కూడి చెడుపనులు చేయుచుండిరి. నేనును వారితో చేరి చెడుపనులను చేసితిని. చీకట్లలో దూరుటకు, వారు వినరాని, ఎరుగరాని చెడుపనులను చేయుటకు పాలు పడితిని. ఈ కారణముచే నన్ను నీవు స్వీకరించదగనివానిగా భావించితివి. నన్ను నీ భక్తుని చేసికొనుటకు తిరస్కరించి వెడలగొట్టితివి. ఐనను నేను లెక్కపెట్టను. ఇంటిలోనుండి వెడలగొట్టుచుండగా చూరులు పట్టుకొని వ్రేలాడుచున్నాడు అన్న సామెతగ నేను నిన్నే ఆశ్రయించుచున్నాను. నన్ననుగ్రహించి నా కోరికలను అభీష్ఠములను ఏల ఈయవు. 

No comments:

Post a Comment