Pages

Friday, August 26, 2011

భసితోద్ధూళనధూసరాంగులు

భసితోద్ధూళనధూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపో
వ్యసనముల్ సాధితపంచవర్ణరసముల్ వైరాగ్యవంతుల్ నితాం
తసుఖస్వాంతులు సత్యభాషణలు నుద్యద్రత్నరుద్రాక్షరా
జిసమేతుల్ తుదనెవ్వరైన గొలుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! విభూతి ధూళి రేగునట్లు పూసికొనుటచే దుమ్ముతో నిండిన శరీరము కలవారు, తమ తలలపై ఉన్న జడల బరువుతో నిండిన తమ శిరస్సులు కలవారు, శివతత్త్వమునే నిరంతరము భావన చేయుట అను తపమునందే మునిగి చిక్కుకొనియుండు అంతఃకరణవృత్తులు కలవారు, తమ నాలుకలపై పంచాక్షరీమంత్రమును నిలుపుకొని జపసిద్ధి పొందినవారు ప్రాపంచిక సుఖముల విరక్తి నొందినవారు, తమకు ఏమియున్నను లేకున్నను ఉన్నదానితోనే ఆనందముతో నుండువారు సత్యమునే పలుకువారు, మిగుల ప్రకాశించుచుండు రత్నములవలె శ్రేష్ఠరుద్రాక్ష పంక్తులతో కూడిన వారును అగునట్టి నీ భక్తులు ఎవ్వరు అయినను వారి యితరము లగు భేదములను ఎన్నక వారిని సేవింతును. 

No comments:

Post a Comment