అకలంకస్థితి నిల్పి నాడ మను ఘంటా(ఆ)రావమున్ బిందుదీ
పకళాశ్రేణి వివేకసాధనములొప్పన్ బూని యానందతా
రకదుర్గాటవిలో మనోమృగముగర్వస్ఫూర్తి వారించువా
రికిఁగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీ కాళహస్తీశ్వరా!
పకళాశ్రేణి వివేకసాధనములొప్పన్ బూని యానందతా
రకదుర్గాటవిలో మనోమృగముగర్వస్ఫూర్తి వారించువా
రికిఁగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! అడవిలో గర్వముతో పొగరుతో తిరుగుచు బాధించు మృగమును బంధించుటకు, అడవినుండి బయటకు వచ్చు మార్గమును ముందే ఏర్పచుకుని, దాని పరిసరములకు పోయి భయంకరములైన ఘంటలు, ఢంకాది వాద్యముల ధ్వనులతో భయపెట్టి లొంగదీసుకుందురు. అట్లే ఉపాసకులు ప్రణవనాదమను ఘంటయు, బిందువను దీపకాంతుల శ్రేణులు, వివేకాదులు సాధనములుగ చేసికొను, మనస్సు స్వాధీనమైన తర్వాత సంసారారణ్యము నుండి వెలికి వచ్చు మార్గముగా తారకయోగము తోడు చేసికొని సంసారబంధములను భయంకరమైన తీగలకట్టలను త్రెంచుట ఏమి ఆశ్చర్యము. కాని ఇవి లేని వారికి ఇట్టి సాధనములనుపయోగిచనివారికి సంసారబంధములు ఎట్లు వీడును.
No comments:
Post a Comment