Pages

Friday, August 26, 2011

పుడమి న్నిన్నొక

పుడమి న్నిన్నొక బిల్వపత్రముననేఁ బూజించి పుణ్యంబునుం
బడయన్నేరక పెక్కుదైవములకుం బప్పుల్ ప్రసాదంబులం
గుడుముల్ దోసెలు సారెసత్తులడుకుల్ గుగ్గిళ్ళునుం బేట్టుచుం
జెడి యెందుం గొఱగాకపోదు రకటా! శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నీ యందు సరియైన భక్తిగల తత్వజ్ఞానియైన భక్తుడు ఒక మారేడు దళముతో నిన్ను పూజించెనేని అనంతపుణ్యము పొందగలడు. అట్టి భక్తి లేకయో ఏమో కొందరు ఇతరదైవములను నమ్మి వారికి భక్తులగుచు వారికి పప్పులు, ప్రసాదములు, కుడుములు, దోసెలు, సారెసత్తులు, అటుకులు, గుగ్గిళ్ళు మొదలగు పదార్ధములను నైవేద్యముగ సమర్పించి ఆరాధించుచున్నారు. దీనివలన వారు తగినంతగా ఐహిక సుఖమును పొందజాలరు. పరమున మోక్షానందమును పొందనే పొందజాలరు. 

No comments:

Post a Comment