Pages

Friday, August 26, 2011

దయ జూడుండని

దయ జూడుండని గొందఱాడుదురు నిత్యంబున్ నినుం గొల్చుచున్
నియమం బెంతో ఫలంబు నంతియెకదా నీవీయ పిండెంతో అం
తియకా నిప్పటియుం దలంపనను బుద్ధిం జూడ; నేలబ్బుని
ష్క్రియతన్ నిన్ను భజింప కిష్టసుఖముల్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు నిన్ను అనుదినము సేవించుచు ’నన్ను దయతో చూడుము’ అని ప్రార్ధింతురు. వాస్తవము ఆలోచించగా ఇట్లు ప్రార్ధించుట పనిలేని పని. నీవు భక్తుని నియమనిష్ఠలు, శ్రద్ధయు, విశ్వాసము, భక్తియందలి నిర్మలత్వము ఎంత ఎట్లుండునో అంత ఫలము వారికి లభించును. అల్పసేవతో అధికఫలము లభించదు. అట్లే నిర్మల భక్తితో చిత్తనైష్కర్మ్య యోగముతో నిన్ను సేవించనిదే ఎవరికిని వారికిష్టమగు సుఖములు లభించవు.
 

No comments:

Post a Comment